తెలంగాణలో మరొక సమస్య…బ్లాక్ ఫంగస్ తో వ్యక్తి మృతి

Friday, May 14th, 2021, 11:48:00 AM IST


తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా మరొక సమస్య వచ్చి పడింది. బ్లాక్ ఫంగస్ మరొక పక్క వ్యాప్తి చెందుతుంది. నిర్మల్ జిల్లా భైంసా లోని గణేష్ నగర్ లో ఉంటున్న తోట లింగురాం అనే వ్యక్తి బ్లాక్ ఫంగస్ తో ప్రాణాలను కోల్పోయారు. ఇటీవల కరోనా వైరస్ సొకగా చికిత్స పొందారు. కోలుకున్న అనంతరం బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. అయితే ముక్కు మరియు కళ్ళ నుండి ఇన్ఫెక్షన్ మెదడుకు వ్యాప్తి చెందింది. అయితే ఈ క్రమం లో హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి లో ముగ్గురు కరోనా వైరస్ రోగుల్లో దీన్ని గుర్తించడం జరిగింది.

అయితే ముగ్గురి లో ఇద్దరి పరిస్తితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు అంటున్నారు. అయితే. ఒకరి పరిస్తితి మాత్రం కొంత విషమం గా ఉందని వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి లో బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయి అని తెలంగాణ డీఎం ఈ రమేష్ రెడ్డి తెలిపారు. అయితే ఈ కేసులు కూడా ప్రైవేట్ ఆసుపత్రి నుండి వచ్చాయి అని తెలిపారు. అయితే కరోనా వైరస్ సోకిన ప్రతి ఒక్కరికీ బ్లాక్ ఫంగస్ రాదు అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే హైడోస్ స్టెరాయిడ్స్ వాడే వారిలో ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.