`బ్లాక్‌ మెయిల్‌`కి త‌ర‌ణ్ కితాబు

Friday, April 6th, 2018, 09:57:56 AM IST

భార్య వేరొక‌నితో అక్ర‌మ సంబంధం నెరుపుతూ భ‌ర్త‌ను మోసం చేస్తుంటే ఏం చేయాలి? .. ఈ ప్ర‌శ్న‌కు ఏకైక స‌మాధానం `బ్లాక్ మెయిల్‌` సినిమా చూడ‌డం.. అంటూ ఇటీవ‌ల ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో ఆ చిత్ర‌యూనిట్ ఊద‌ర‌గొట్టింది. బ్లాక్‌మెయిల్ ఈ శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

లేటెస్టుగా ప్రివ్యూ వీక్షించిన ప్ర‌ఖ్యాత ఫిలింక్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ఈ సినిమాకి 4 రేటింగ్ ఇచ్చి బ్రేవ్ ఎటెంప్ట్ అంటూ కితాబిచ్చారు. స్టీరియోటైప్ సినిమాల‌కు పూర్తి భిన్న‌మైన చిత్ర‌మిద‌ని ప్ర‌శంసించారు. అంతేకాదు.. ఇదో `వైల్డ్ వాకీ క్విర్కీ కామెడీ` సినిమా. ఇలాంటివి హిందీ సినిమాల్లో ఇటీవ‌ల వ‌స్తున్నాయ‌ని అన్నారు. ఇలాంటివి స్ట్రాంగ్‌లీ రిక‌మండెడ్‌! అంటూ కన్‌క్లూజ‌న్ ఇచ్చారు. ఇర్ఫాన్ ఖాన్, కృతి కుల్హరి త‌దిత‌రులు న‌టించిన ఈ సినిమా ఏప్రిల్‌ 6న రిలీజ‌వుతోంది. ఒక రోజు ముందే ప్రివ్యూ వీక్షించిన‌ త‌ర‌ణ్ వ‌న్ వ‌ర్డ్ రివ్యూలో ఆకాశానికెత్తేయ‌డంతో సినిమాపై అంచ‌నాలు మ‌రింత రెట్టించాయి.

  •  
  •  
  •  
  •  

Comments