`బ్లాక్ పాంథ‌ర్‌` హీరో ప్ర‌భాస్ అంటే ప‌డిచ‌స్తాడు!

Monday, April 16th, 2018, 10:28:30 PM IST

ప్ర‌భాస్ ఇప్పుడు ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్‌. సూప‌ర్‌స్టార్‌, మెగాస్టార్ల‌నే మించిపోయాడు. అత‌డు ఏకంగా 2500 కోట్లు(బాహుబ‌లి-1&2) వ‌సూలు చేసిన సినిమాలో క‌థానాయ‌కుడిగా, దేశంలోనే నంబ‌ర్ -1 సిరీస్‌లో న‌టించిన స్టార్‌గా గుర్తింపు పొందాడు. అయితే అత‌డిపై ఈ అభిమానం కేవ‌లం లోక‌ల్ లోనే కాదు, అటు ఉత్త‌రాదిన‌, వ‌ర‌ల్డ్‌వైడ్ ఉన్నారంటే అతిశ‌యోక్తి కాదు. బాహుబ‌లి స్టార్‌గా అత‌డిని ప్ర‌పంచమంతా గుర్తించింది. పైపెచ్చు హాలీవుడ్ స్టార్ల‌లోనూ అత‌డికి వీరాభిమానులున్నారంటే న‌మ్మ‌గ‌ల‌రా? ఇదిగో ఈ వీడియోనే అందుకు ప్రూఫ్‌.

ఇటీవ‌లే ఓ ఆంగ్ల చానెల్ ఇంట‌ర్వ్యూలో `బ్లాక్ పాంథ‌ర్‌` ఎం.బాకు (డ్యూక్ అస‌లు పేరు) పాత్ర‌ధారి.. మాట్లాడుతూ ఊహించ‌ని రీతిలో స‌ర్‌ప్రైజ్‌నిచ్చాడు. నేను బాహుబ‌లి సిరీస్‌కి వీరాభిమానిని. ఆ చిత్రంలో ప్ర‌భాస్ స్లోమోష‌న్ షాట్స్ న‌న్ను ఎంతో ఇన్‌స్ప‌యిర్ చేశాయ‌ని బాకు అన్నాడు. ఎం.బాకు అనే పాత్ర `బ్లాక్ పాంథ‌ర్‌`లోనిది. ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజై దాదాపు 6500 కోట్లు ( 1.1 బిలియ‌న్ డాల‌ర్లు) వ‌సూలు చేసింది. అలాంటి గ్రేట్ మూవీలో బ్లాక్‌పాంథ‌ర్‌కి సాయ‌ప‌డే కీల‌క పాత్ర ఎం.బాకు. వాకాండా సామ్రాజ్యంలో జ‌రిగిన అసాధార‌ణ స్టోరీతో ఈ చిత్రం తెర‌కెక్కింది. అంతేకాదు డ్యూక్ అనే వాడు త్వ‌ర‌లో రిలీజ్‌కి వ‌స్తున్న `అవెంజ‌ర్స్‌-ఇన్‌ఫినిటీ వార్‌`లోనూ ఒకానొక సూప‌ర్‌హీరోగా కీల‌క‌పాత్ర పోషించాడు. అంత పెద్ద స్టార్ ఓ తెలుగు హీరోని, అత‌డి సినిమాని అభిమానించ‌డం అంటే గ్రేట్ క‌దా! అయితే ఎం.బాకుకి బాలీవుడ్ తో లింకుంది. ఇండియ‌న్స్‌తో క‌లిసి పెరిగిన వాతావ‌ర‌ణం త‌న‌ద‌ని చెప్పుకొచ్చాడు. బాహుబ‌లి సినిమాల్ని మ‌ళ్లీ మ‌ళ్లీ చూస్తాన‌ని తెలిపాడు.