షాక్ … ఎన్టీఆర్ కు బ్లాంక్ చెక్ అఫర్ ?

Friday, September 30th, 2016, 01:19:34 PM IST

ntr
మొత్తానికి ”జనతా గ్యారేజ్” సినిమాతో ఎన్టీఆర్ కెరీర్ కి మంచి బూస్టప్ వచ్చింది ? తన కెరీర్ లో బాక్స్ ఆఫీస్ రికార్డు ఇప్పటిదాకా పెద్దగా లేదు, అప్పట్లో ”సింహాద్రి” సినిమాకు తప్ప ఎన్టీఆర్ కెరీర్ లో బాక్స్ ఆఫీస్ హిట్ లేదు, కానీ ‘జనతా గ్యారేజ్’ తో ఏకంగా వందకోట్ల మార్కెట్ కు చేరువయ్యాడు. ఇక జనతాతో తన స్టామినాకు రిపేర్లు చేసుకున్న ఎన్టీఆర్ కు ఇప్పుడు వరుసగా భారీ అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఓ బడా నిర్మాత అయితే ఏకంగా బ్లాంక్ చెక్ అఫర్ ఇచ్చాడట !! రెమ్యూనరేషన్ కింద నీకు ఇష్టమైన అంకె రాసుకో అని చెప్పాడట ? నిజంగా ఈ విషయం టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది ? కానీ సదరు నిర్మాతకు మాత్రం ఎన్టీఆర్ సారీ చెప్పాడని తెలిసింది. అయితే ఎన్టీఆర్ మళ్ళీ మైత్రి మూవీ బ్యానర్ లోనే మరో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి గ్యారేజ్ రిపేర్లతో ఎన్టీఆర్ స్టామినా మాత్రం బాగా పెరిగింది. ఫాన్స్ ఫుల్ జోష్ మీదున్నారు ?