వైరల్ వీడియో : దీని స్పీడ్ చూస్తే దిమ్మ తీరగడం ఖాయం..8 సెకన్లలో 300 స్పీడ్

Saturday, October 28th, 2017, 11:41:32 AM IST

ఆధునిక ప్రపంచంలో మానవుడు కాలంతో పోటీ పడుతున్నాడనే చెప్పాలి. రోజుకో కొత్త టక్నాలిజీని కనిపెడుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే.. ఇప్పటికే అత్యధునిక కార్ల వేగం మనిషిని చాలా ఆశ్చర్యపరుస్తున్నాయి. రాకేట్ స్పీడ్ తో పోటీ పడుతున్నాయి. రీసెంట్ గా ఒక కారు వేగాన్ని చూస్తే ఎంతటి వారైనా షాక్ అవ్వాల్సిందే. 8 సెకన్లలోనే 337.9 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్న ఒక కారు రికార్డు సృష్టించింది. ప్రస్తుతం దానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బ్లడ్‌ హౌండ్ ఎస్ఎస్‌సీ అనే కారును కారును ఇటీవల ఇంగ్లండ్‌లోని నైరుతి ప్రాంతమైన కార్న్‌వాల్‌ న్యూక్వేలో ఉన్న రన్‌వేపై పరీక్షించారు. ఆ కారు 8 సెకెన్లలోనే 300 వేగాన్ని దాటేసి చరిత్ర సృష్టించింది. ‘బ్లడ్‌హౌండ్’ సంస్థ గత కొంత కాలంగా ఈ రికార్డు కోసం చాలా కష్టపడింది. అయితే ఈ సంస్థ టార్గెట్ ఏమిటంటే.. మరో మూడేళ్లలో 1609 కిలోమీటర్ల వేగంతో వెళ్లే కారుని తాయారు చేయాలనీ కృషి చేస్తోంది. ఇప్పటికే అందుకు తగిన ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు. ఇక నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా వేగంతో వెళ్లే కారును తాయారు చేస్తామని వారు చెప్పారు.