బోటు తీయడం ప్రభుత్వానికి ఇష్టం లేదు.. ఎక్స్‌పర్ట్ సంచలన వ్యాఖ్యలు..!

Friday, September 20th, 2019, 07:35:51 PM IST

తూర్పుగోదావరి జిల్లా పాపికొండల యాత్రకు ప్రయాణికులతో బయలుదేరిన టూరిజం బోటు కచ్చులూరు వద్ద నీట మునిగిన సంగతి తెలిసిందే. అయితే గత ఆదివారం 73 మంది పాపికొండలు యాత్రకు బయలుదేరిన రాయల్ వశిష్ట లాంచీ గోదావరి ఉదృత్తికి తట్టుకోలేక నీటిలో మునిగిపోయింది. అయితే ఈ ప్రమాదంలో 26 మంది ప్రయాణికులు సురక్షితంగా భయటపడగా, 35 మృతదేహాలను వెలికితీసారు. అయితే ప్రమాదం జరిగి ఆరు రోజులు కావస్తున్నా ఇంకా 12 మంది ఆచూకీ దొరకడంలేదు. అయితే నీటిలో మునిగిన బోటు 210 అడుగుల లోతులో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే ఈ బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ బోటు ప్రమాదానికి పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ గారే పూర్తి బాధ్యుడని దేవీపట్నం వద్ద బోటు వెళ్ళేందుకు ఎస్సై అనుమతి ఇవ్వలేదని, ఆ సమయంలో మంత్రి అవంతి శ్రీనివాస్ ఫోన్ చేసి మరీ బోటు వెళ్ళేందుకు అనుమతులు ఇవ్వాలని ఆదేశించారని ఆరోపించారు. అంతేకాదు ప్రయాణికుల విషయంలో కూడా అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, గోదావరిలో పర్యాటకుల కోసం తిరిగే బోట్లలో రాజకీయ నేతలకు, పర్యాటకశాఖ అధికారులకు పెట్టుబడులు ఉన్నాయని దీనిపై జగన్ దర్యాప్తు చేయించాలని కోరారు.

అయితే తాజాగా నదులలో చిక్కుకున్న బోట్లను బయటకు తీసే ఎక్సపర్ట్ కూడా ఈ ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. అయితే బోటు ఆచూకీనీ కనిపెట్టిన ఎక్స్‌పర్ట్ వెంకటశివ ప్రమాదం జరిగిన రెండవ రోజే బోటు తీస్తానని అధికారులకు చెప్పానని అందుకోసం రన్నింగ్ పంటు, రోప్ ఇస్తే రెండు గంటలలో బోటు బయటకు వస్తుందని చెప్పానని అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా ఉత్తరాఖాండ్ నుంచి నిపుణులను పిలిపించారని, వారు తీసుకొచ్చిన కెమెరాలు కూడా పనిచేయడం లేదని అన్నారు. అంతేకాదు బోటును భయటకు తీయడం అధికారులకు ఇష్టం లేదని, బోటు యజమానులు మరియు అధికారులు కుమ్మక్కై కేసును తప్పుదోవ పట్టిస్తున్నట్టు వెల్లడించారు. మరి ఈ వివాదంపై ఇలా వాదనలు వినిపిస్తుంటే జగన్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారన్నదే ఇప్పుడు అందరి మెదడులో మెదులుతున్న ప్రశ్న.