ఎన్టీఆర్ లిస్ట్ లో మరో… కొత్త దర్శకుడు?

Tuesday, November 22nd, 2016, 03:37:06 PM IST

boby
‘జనతా గ్యారేజ్’ తరువాత ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా పై ఇంకా సరైన నిర్ణయం తీసుకున్నట్టు లేడు!! ఇప్పటికే పలువురు దర్శకులతో కథా చర్చలు జరుపుతూనే ఉన్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్, పూరి జగన్నాధ్, అనిల్ రావిపూడి, వక్కంతం వంశీ .. అంటూ పెద్ద లిస్టే తయారైంది ? మొత్తానికి త్రివిక్రమ్ సినిమాకు ఇంకాస్తా టైం పట్టేలా ఉంది, మరో వైపు పూరి సిద్దంగానే ఉన్నాడు కానీ .. ఎన్టీఆరే ముందుకు రావడం లేదు!! ఇదిలా ఉండగా ఇప్పుడు ఎన్టీఆర్ దర్శకుల లిస్ట్ లోకి మరో కొత్త దర్శకుడు చేరాడు !! .. అయన ఎవరో కాదు బాబీ. రవితేజతో ‘పవర్’ సినిమా చేసిన బాబీ తోలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ తో ఛాన్స్ కొట్టేసాడు. పవన్ తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా చేసి భారీ పరాజయాన్ని చవిచూసాడు? ఇక ఆ సినిమా తరువాత బాబీ కి అవకాశాలు రావడం లేదు .. అయితే లేటెస్ట్ గా ఎన్టీఆర్ కు సూపర్ కథ చెప్పాడని తెలుస్తోంది? కమర్షియల్ సినిమా ఎలా చేయాలో బాగా తెలిసిన బాబీ … చెప్పిన కథ ఎన్టీఆర్ కు బాగా నచ్చి .. ఓకే చెప్పినట్టు సమాచారం? మరి ఎన్టీఆర్ ఇప్పుడు బాబీ సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడో లేకా .. ఇంకా వెయిట్ చేస్తాడో చూడాలి !!