తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్టే పట్టి మళ్ళీ గత కొద్ది రోజుల నుంచి పెరుగుతున్నాయి. వాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికి కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడంలేదు. అయితే సామాన్యులతో పాటు ఎంతో మంది ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్లో ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారిన పడ్డారు. అయితే తాజాగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
అయితే వారం రోజుల కిందట ఎమ్మెల్యే షకీల్ తండ్రికి కరోనా పాజిటివ్ అని తేలింది. స్వల్ఫ లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్ట్ చేయించుకున్న ఎమ్మెల్యే షకీల్‌కు పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఎమ్మెల్యే షకీల్ హోం క్వారంటైన్లో ఉన్నారు. గత వారం రోజులుగా తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.