బాబోయ్ ఇంత గొప్ప అవార్డ్ ర‌ణ్‌వీర్‌ కి వచ్చిందా.. ఇంతకీ ఏమిటదీ..?

Wednesday, April 11th, 2018, 11:43:45 AM IST

దాదా సాహెబ్ ఫాల్కే ఫౌండేష‌న్ ఇండ‌స్ట్రీకి సంబంధించిన ద‌ర్శ‌కులు,నటులు, నిర్మాత‌ల ప్ర‌తిభ‌ని గుర్తించి వారిని ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఎక్స్‌లెన్స్‌ అవార్డు’తో స‌త్క‌రించాల‌నుకుంటోంది. రీసెంట్‌గా నటిగానే కాకుండా నిర్మాత‌గాను రాణిస్తున్న అనుష్క‌ని స‌త్క‌రించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఇక తాజాగా ప‌ద్మావ‌తి చిత్రంలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర‌లో న‌ట విశ్వ‌రూపం చూపించిన ర‌ణ్‌వీర్‌ని ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఎక్స్‌లెన్స్‌ అవార్డు’కి ఎంపిక చేసినట్లు అవార్డు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. 300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ప‌ద్మావ‌తి చిత్రంలో ఖిల్జీ పాత్ర అభిమానుల‌నే కాదు క్రిటిక్స్‌ని కూడా అబ్బుర‌ప‌ర‌చింది. ఖిల్జీ పాత్ర‌లో ర‌ణ్‌వీర్ ఒదిగిన తీరు ప్ర‌శంస‌నీయం అంటూ విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లు కురిపించారు. సంజ‌య్ లీలా భ‌న్సాలీ చిత్రంలోని మిగ‌తా పాత్ర‌ల‌ని అద్భుతంగా రూపొందించిన‌, ఖిల్జీ పాత్ర మాత్రం అందరి మ‌న‌సుల‌కి హ‌త్తుకు పోయింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కి అరుదైన అవార్డు ద‌క్క‌నుంది. ర‌ణ్‌వీర్ త్వ‌ర‌లో దీపికాని వివాహం చేసుకోనున్నాడ‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం రణ్‌వీర్ గ‌ల్లీబాయ్, సింబా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments