వైరల్ వీడియో : కెమెరా చూడగానే దాక్కున్నా సీనియర్ హీరోయిన్.. ఎందుకో?

Thursday, March 8th, 2018, 10:40:14 PM IST

సెలబ్రెటీలు ఎక్కడైనా బయట కనిపిస్తే జనాలు ఒక్కసారిగా వారి మీదకు ఎగబడటం సహజమే. దీంతో సెలబ్రెటీలు ఎవ్వరికి కనిపించకుండా అయినా లేక బాడీ గార్డ్స్ తో బయటకు వస్తుంటారు. అయితే కొంత మంది సినీ తారలు వ్యక్తి గత జీవితాన్ని సంతోషంగా గడపాలని అప్పుడపుడు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వస్తుంటారు. ఎవ్వరికి అనుమానం రాకుండా మొహం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఒక్కోసారి వారు ఊహించని విధంగా బయటపడుతుంటారు.

రీసెంట్ గా అదే తరహాలో బాలీవుడ్ సీనియర్ నటి రేఖ బయటపడ్డారు. ఎవరికీ కనిపించకుండా ఆమె తెల్లని దుస్తుల్లో ఓ షాప్ నుంచి బయటకు వస్తు.. కనిపించారు. దీంతో కొంత మంది ఆమెను గ్రహించి ఫొటోలు తీయడం స్టార్ట్ చేశారు. అది గమనించిన రేఖ వెంటనే ముఖాన్ని తిప్పుకుంది. ఆమె మేనేజర్ తోడుగా వచ్చారు. ఫాస్ట్ గా ఆమె కారులో కూర్చొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేకప్ లేకుండా బయటకు రావడంతో రేఖ ఆ విధంగా మొహాన్ని చాటేసుకున్నారని ఎవరికీ తోచినట్టుగా వారు టైటిల్స్ ఇచ్చేస్తున్నారు.