శ్రీదేవితో అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయిన బాలీవుడ్ నటి!

Monday, March 5th, 2018, 08:18:50 PM IST

ప్రముఖ నటి శ్రీదేవి మరణాన్ని సినీ ప్రేమికులు, ఆమె అభిమానులే కాదు సినీ ప్రముఖులు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఆమెతో వారు గడిపిన సందర్భాలను ఎవరికి వారు గుర్తుచేసుకుంటున్నారు. ఇటీవల ప్రియాంక చోప్రా శ్రీదేవిని గుర్తు చేసుకుని ట్విట్టర్‌లో తన బాధను పంచుకున్న విషయం తెలిసిందే. అలానే ఆమెతో మంచి సాన్నిహిత్యం ఉన్నవారిలో బాలీవుడ్ నటి శిల్ప శెట్టి ఒకరు. నేడు ఆమె శ్రీదేవి తో గడిపిన ఒక సందర్భం తాలూకు వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

అయితే మామ్ సినిమా విడుదల సమయంలో కరణ్ జోహార్ శ్రీదేవి, శిల్పాశెట్టి, మనీష్ మల్హోత్రాలను తన ఇంటికి విందుకు ఆహ్వానించారు. ఆ సమయంలో జరిగిన సందడిని వీడియో తీశారు. ఆ వీడియోలో శ్రీదేవి సరదాగా జోక్స్ వేసుకుంటూ శిల్ప, కరణ్, మనీష్‌లతో కలిసి పగలబడి నవ్వుతున్న దృశ్యాలున్నాయి. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె సండే బింజ్ స్వీట్‌నెస్ నా హృదయంలో ఎప్పటికీ గుచ్చుకుంటూనే ఉంటుంది. నేను మిమ్మల్నిఎప్పటికీ ఇలా గుర్తుంచుకుంటాను శ్రీజీ. జీవితాంతం ప్రేమతో ఆమెను ఎవరైతే ప్రేమిస్తారో వారందరి కోసం ఈ వీడియో అని ఆమె తన పోస్ట్ లో పేర్కొన్నారు…