స్టోరీ నెరేట్ చేయాలంటే గ‌దిలోకి ర‌మ్మ‌న్నాడు.. ప్ర‌ముఖ న‌టి సంచ‌ల‌నం..!

Saturday, October 20th, 2018, 11:56:10 AM IST

దేశ‌వ్యాప్తంగా మీ..టూ ప్రంకంప‌న‌లు రేపుతున్న సంగ‌తి తెలిసిందే. సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌హిళ‌ల పై లైంగిక వేధింపుల‌కు వ్యతిరేకంగా ఏర్ప‌డిన మీ..టూ ఉధ్య‌మం ఇప్పుడు అన్ని రంగాల వారిని టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే. మీ..టూ దెబ్బ‌కి తాజాగా కేంద్ర‌మంత్రి సైతం రాజీనామా చేయ‌డం దేశ‌వ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఇక బాలీవుడ్‌లో అయితే ప్ర‌ముఖ నటులు,ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల పై వ‌రుస‌గా లైంగిక ఆరోప‌ణ‌లు రావ‌డంతో బీటౌన్ సినీ వ‌ర్గీయుల్లో క‌ల‌క‌లం రేపుతోంది.

బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు నానా పాటేక‌ర్‌తో మొద‌లైన ఈ లైంగిక ఆరోప‌ణ‌ల ప‌రంప‌రా రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఈ నేప‌ధ్యంలో తాజ‌గా బాలీవుడ్ వెబ్ సిరీస్ సాక్రెడ్ గేమ్స్ లో మెరిసిన హాట్ భామ ఎల్నాజ్‌ నరౌజీ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడి పై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. బాలీవుడ్ డైరెక్ట‌ర్ విపుల్ షా త‌న‌ను న‌మ‌స్తే ఇంగ్లాడ్ ఆడిష‌న్స్‌కు పిలిపించి.. త‌న‌తో చాలా అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని చెప్పింది. తొలిరోజు ఆడిష‌న్‌లో త‌న‌ను బ‌ల‌వంతంగా ముద్దు పెట్టుకున్నాడ‌ని.. ఆ త‌ర్వాత స్టోరీ నెరేట్ చేయ‌మంటే.. నా బెడ్‌రూంకి వ‌స్తే స్టోరీ నెరేట్ చేస్తాన‌ని అన్నాడ‌ని ర‌మ్మన్నాడ‌ని.. ఆయ‌న టార్చ‌ర్ దెబ్బ‌కి దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయాన‌ని నటి నౌరోజీ సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టింది.

  •  
  •  
  •  
  •  

Comments