హృతిక్ పై మరోసారి బాలీవుడ్ భామ ఫైర్ అయింది !!

Wednesday, February 8th, 2017, 02:10:28 AM IST


బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ మధ్య సంచలన కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ గా మారింది. అటు సినిమాల గురించి, ఇటు పర్సనల్ లైఫ్ గురించి కామెంట్స్ చేస్తూ ఈమె చేస్తున్న కామెంట్స్ బాలీవుడ్ లో హల్చల్ అవుతున్నాయి. ఆ మధ్య హృతిక్ తో విడిపోయిన తరువాత అతడిపై ఘాటు వ్యాఖ్యలు చేసి దుమ్ము రేపిన ఈ అమ్మడు మరోసారి అయన పై ఘాటు కామెంట్స్ చేసింది. సిల్లీ ఎక్స్ అంటూ హృతిక్ ని ఉద్దేశించి కామెంట్స్ చేసిన కంగనా తన కెరీర్ ని హృతిక్ నాశనం చేసేందుకు కుట్రలు పన్నుతున్నడని, నాకు వ్యతిరేక సాక్షాలతో తమను కలిసాడంటూ చాలా మంది ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసారని చెప్పింది. హృతిక్ కు నేను చాలా మెయిల్స్ పంపానని అంటున్నాడు .. అలాంటి చెత్త రాతలు రాస్తే అలవాటు నాకు లేదని, నేను న్యూయార్క్ ఫిలిం ఇన్స్టిట్యూట్ నుండి అధికారిక స్క్రీన్ రైటర్ ని అని చెప్పింది.