ప్రధాని మోడీ ని కలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు

Sunday, October 20th, 2019, 01:45:25 AM IST

శనివారం నాడు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా కొందరు బాలీవుడ్ ప్రముఖులను కలుసుకున్నారు. కాగా ఢిల్లీలోని లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి బాలీవుడ్‌ నటులు అమీర్‌ఖాన్‌, షారూక్‌ ఖాన్‌లతో పాటు మరికొందరు హీరోయిన్లు, మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు. అయితే మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ప్రజలందరికీ తెలిసేలా మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంలో పీఎం మోడీ మాట్లాడుతూ… మహాత్మాగాంధీ సిద్ధాంతాలను అందరికి తెలియపరచడంలో సినీ, టీవీ పరిశ్రమకు చెందిన కొందరు చాలా బాగా కృషి చేస్తున్నారని వాఖ్యానించారు.

ఆతరువాత మహాత్మాగాంధీ గొప్పతనాన్ని, ఆయన అనుసరించిన విధివిధానాలను ప్రధాని మోడీ ఆ సమావేశంలో వివరించారు. ఆతరువాత మనం వెళుతున్నటువంటి ప్లాస్టిక్ ని వీలైనంత తొందరగా విషేదించాలని, కాగా ఈ విషయంలో తనకు మద్దతు తెలిపినటువంటి బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్‌కు ప్రధాని మోడీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఇకపోతే ఈసమావేశానికి హాజరైనటువంటి మరొక నటుడు షారుఖ్ ఖాన్ కి కూడా ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోడీ.