సావిత్రి సినిమాపై ఆసక్తిగా ఉందంటున్న రేఖ ?

Sunday, May 13th, 2018, 04:29:32 AM IST


ప్రముఖ బాలీవుడ్ నటి రేఖ తెలుగులో రూపొందిన సావిత్రి బయోపిక్ మహానటి సినిమా చూడడానికి ఆసక్తిగా ఉందని చెప్పిందట. సావిత్రి వయసుకు చిన్నమ్మ కావడంతోనే ఈ సినిమా పై రేఖ ఇంట్రెస్ట్ చూపిస్తుందని టాక్. కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తూ నాగ అశ్విన్ తెరకెక్కించిన మహానటి ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన ప్రతి చోట అనూహ్యమైన స్పందన రావడంతో ఈ సినిమా క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. ఇక ఓవర్ సీస్ లో కూడా మహానటి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ రేఖ ఈ సినిమా చూడాలని ఉందని చెప్పిందట. జెమినీ గణేశన్ మొదటి భార్య పుష్పవల్లి కూతురైన రేఖ బాలీవుడ్ లో సెటిల్ అయింది. సావిత్రిని జెమినీ గణేశన్ రెండో పెళ్లి చేసుకోవడంతో ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగింది. తన తండ్రి .. చిన్నమ్మ సినిమా కావడంతో ఈ సినిమా చూడాలని రేఖ ఆసక్తి పెంచుకుంది. త్వరలోనే ఆమెకు సినిమా చూపించే ప్రయత్నాలు చేస్తారట దర్శక నిర్మాతలు.