షాకింగ్ వీడియో : బాలీవుడ్ హీరో ఇందర్ నిజంగానే ఆత్మా హత్య చేసుకున్నాడా..? లేక

Tuesday, May 15th, 2018, 05:42:46 PM IST

గడిచిన సంవత్సరం ప్రముఖ బాలీవుడ్ హీరో ఇందర్ కుమార్ హార్ట్ స్ట్రోక్ వచ్చి హటాత్తుగా మరణించాడు. అయితే బాలీవుడ్ సినీ వర్గంలో మాత్రం ఏడాది గడిచినా కూడా ఇప్పటికీ అతని మరణంపై కొందరికి అనుమానాలు వస్తూనే ఉన్నాయి. అతని మరణంపై ఇంతటి అనుమానాలు రావడానికి ఓ కారణం కూడా ఉంది. ఇటివల సోషల్ మీడియాలో ఇందర్ చనిపోవడానికి ముందు తీసిన వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో హీరో ఇందర్ కెమెరా ముందు మాట్లాడుతూ ” నా చావుకు ఎవ్వరూ కారణం కాదు, నాకు వున్న చెడు అలవాట్లు నా జీవితాన్ని పూర్తిగా నాశనం చేశాయి. బాలీవుడ్ లో చాలా పేద హీరో అవ్వాలని ముంబాయికి వచ్చాను. కానీ అవకాశాలు దక్కించుకోవడానికి ఎన్నో చేయరాని తప్పులు చేశాను. దీనికి నా తల్లిదండ్రులు నన్ను క్షమించమని కోరుతున్నాను. ఇక నాకు బ్రతికే అర్హత లేదు నేను ఆత్మా హత్య చేసుకోవాలనుకుంటున్నాను అని ఆ వీడియోలో కడుపు తలుక్కుపోయేలా ఏడుస్తూ చెప్పాడు. కానీ నిజానికి అతని మరణానికి అసలు కారణం అది కాదని అతని భార్య చెప్తుంది.

ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ఇందర్ కుమార్ అతను చెప్పిన కారణాలు నిజమే కావచ్చునని, అందికే ఆత్మాహత్య చేసుకొని ప్రాణాలు వదులుకున్నాడని అనుమానిస్తున్నారు. ఈ విషయంపై కలత చెందిన ఇందర్ భార్య మీడియా ఇటివల మీడియాను పిలిపించి అతని మరణానికి అసలు కారణం చెప్పింది. సినిమా జీవితాల గురింఛి అందరికీ తెలిసిందేనని అంతటి కష్టాలు పడిన ఆయన కేవలం ఇంత చిన్న విషయానికి ఆత్మాహత్య చేసుకునేంత పిరికివాడు కాదని తెలిపింది. ఇప్పుడు అందరూ చూస్తున్న వీడియో “ఫటీ పడి హై” సినిమాలోనిదని అన్నారు, ఇందర్ భార్య పల్లవితో పాటు ఆ సినిమా దర్శకుడు కూడా ఇదే విషయం వెల్లడించాడు.

Comments