టోనీ ఝాకే చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న ఈ హీరో ఎవ‌రు?

Thursday, March 15th, 2018, 10:06:14 AM IST

ఏనుగుల‌పై లంఘించి భీక‌ర పోరాటాలు చేసే మ‌హాయోధుడిగా టోనీ ఝాని తెర‌పై చూశాం. అతడు న‌టించిన ఆంగ్ బ్యాక్ సిరీస్‌కి వీర‌లెవ‌ల్లో ఫాలోవ‌ర్స్ ఉన్నారు. అసాధార‌ణ మార్ష‌ల్ ఆర్ట్స్ ప్ర‌జ్ఞాపాట‌వాలు మైమ‌రిపిస్తాయి. అందుకే టోనీ ఝా అంటే ప‌డిచ‌చ్చే ఫ్యాన్స్ ఉన్నారు.

ఎవ‌రైతే ఝా ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ల‌కు కూడా ఈ బాలీవుడ్ యువ‌హీరో న‌చ్చి తీర‌తాడు. అత‌డే విద్యుత్ జ‌మ్వాల్ .. ఎన్టీఆర్ శక్తి, ఊస‌ర‌వెల్లి చిత్రాల్లో విల‌న్ గా న‌టించిన అత‌డు విజ‌య్ తుపాక్కి చిత్రంలోనూ విల‌న్ గా మెప్పించాడు. త‌ళా అజిత్ కి విల‌న్‌గా న‌టించాడు. అయితే బాలీవుడ్‌లో ప్ర‌స్తుతం అత‌డు హీరోగా కెరీర్‌ని సాగిస్తున్నాడు. జమ్వాల్ న‌టించిన క‌మెండో, క‌మెండో 2 చిత్రాలు బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌. ఇప్పుడు జంగ్లీ అనే ఇంట‌ర్నేష‌న‌ల్ చిత్రంలోనూ న‌టిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ తేదీని తాజాగా ప్ర‌క‌టించారు. జంగ్లీ పిక్చ‌ర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని 19 అక్టోబ‌ర్ 2018న ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారు. త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ఆ మేర‌కు వివ‌రాలంఇంచారు. ఏనుగుల‌తో జ‌మ్వాల్ స్టిల్ చూడ‌గానే టోనీ ఝా న‌టించిన `ఆంగ్ బ్యాక్‌` సిరీస్ లైవ్లో క‌నిపిస్తోంది క‌దూ? ఈ సినిమాని స్కార్పియ‌న్ కింగ్ డైరెక్ట‌ర్ డైరెక్ట్ చేశారు.