హృతిక్ కొత్త కారు చూశారా..? ఇంతకీ రేటెంతో తెలుసా..?

Thursday, April 12th, 2018, 06:00:51 PM IST

బాలీవుడ్ స్టార్లకు ఖరీదైన బైకులు, లగ్జరీ కార్లు కొత్త కాదు. మార్కెట్‌లోకి ఏ కొత్త బ్రాండ్ వచ్చినా అవి తమ గ్యారేజ్‌లో ఉండాల్సిందే. ఈ మధ్య రెండు వారాలుగా బాలీవుడ్ స్టార్లు వరుసగా ఈ బైకులు, కార్లు కొనడంలో బిజీగా ఉన్నారు. అక్షయ్‌కుమార్ జీప్ కంపాస్ ఎస్‌యూవీ కొనగా.. అర్షద్ వార్సీ డ్యుకాటి మాన్‌స్టర్ 797 డార్క్ ఎడిషన్ కొన్నాడు. తాజాగా మరో స్టార్ హృతిక్ రోషన్ అయితే వీళ్లను మించిపోయాడు. ఏకంగా రూ.3.2 కోట్లు పెట్టి ఆస్టన్ మార్టిన్ రాపిడ్ ఎస్ కారు కొన్నాడు. ఈ కారు 0 నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ఠంగా గంటలకు 327 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. ఆస్టన్ మార్టిన్ బ్రాండ్‌లో ఈ రాపిడ్‌కు మంచి డిమాండ్ ఉంది. లగ్జరీ కార్లంటే హృతిక్‌కు చాలా ఇష్టం. ఇప్పటికే అతని దగ్గర సుచాస్ రోల్స్ రాయ్స్ ఘోస్ట్, పోర్షె కాయెన్ టర్బో ఎస్, రేంజ్ రోవర్ వోగ్, మెర్సిడీజ్ మేబాక్, మెర్సిడీజ్ బెంజ్ ఎస్ క్లాస్‌లాంటి సూపర్ లగ్జరీ కార్లు ఉన్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments