కాస్టింగ్ కౌచ్ గురించి ఆ హీరోయిన్ ఓపెన్ గా మాట్లాడింది ?

Thursday, April 26th, 2018, 11:28:24 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ పెద్ద దుమారం రేపుతున్న విషయం కాస్టింగ్ కౌచ్? శ్రీ రెడ్డి పోరాటంతో టాలీవుడ్ లో పలు సంచలనాలకు దారి తీస్తున్న ఈ విషయాలపై దేశ వ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి. కాస్టింగ్ కౌచ్ విషయంలో బాలీవుడ్ ఏమి తక్కువ కాదని తెలిపారు ఇద్దరు హీరోయిన్స్. అందులో ఒకరి సంచలన తారగా ఇమేజ్ తెచ్చుకున్న రాధికా ఆప్టే. మరొకరు .. మరాఠి నటి .. అవార్డు గ్రహీత అయినా ఉషా జాదవ్. తాజాగా కాస్టింగ్ కౌచ్ పై బిబిసి ఓ డాక్యూమెంటరీ తెరకెక్కించింది. ఈ డాక్యూమెంటరీ లో పలువిషయాలు చర్చించారని మెచ్చుకున్నారు. ఈ విషయం పై ఉష జాదవ్ మాట్లాడుతూ .. తాను కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. దర్శకుడు, నిర్మాతలు కలిసి పడుకోవాలని డైరెక్ట్ గానే అడిగేవారట. తన ఒళ్ళంతా చేతులు వేసి తడిమే వారని, ఇష్టమొచ్చిన చోటల్లా ముద్దులు పెట్టె వారని, దుస్తుల్లోపల చేతులు పెట్టేవారని అయినా భరించాలి అన్నట్టుగా ఫోర్స్ చేసేవారని .. ఇలాంటి అనుభవాలు తనకు చాలా సార్లు ఎదురయ్యాయాని తెలిపింది. ఇక రాధికా స్పందిస్తూ కొందరి విషయంలో ఏమి మాట్లాడిన పెద్ద ఇస్స్యూ అవుతుందని, అందుకే వారి గురించి చెప్పి కెరీర్ పాడుచేసుకోవడం ఎందుకనే కొందరు బయపెడతారని తెలిపింది. మొత్తానికి కాస్టింగ్ కౌచ్ గురించి పలువురు హీరోయిన్స్ ఇలా మాట్లాడడంతో పెద్ద దుమారమే రేగుతుంది.

  •  
  •  
  •  
  •  

Comments