డ్రగ్ మాఫియా రాకెట్లో సినీ నిర్మాత ?

Thursday, November 3rd, 2016, 12:20:37 PM IST

drugs
ఈ మధ్య కాలంలో డ్రాగ్ మాఫియా సినిమా రంగాన్ని అంధకారంలో పడేస్తుంది. ఇప్పటికే పలువురు ఈ విషయంలో చిక్కుకుపోయారు. లేటెస్ట్ గా భారీ డ్రగ్ రాకెట్ గుట్టు రట్టయింది ? రెవెన్యూ ఇంటిలిజెన్స్ డిఐఆర్ ఈ రాకెట్ ను రట్టు చేసింది. ఈ రాకెట్ ఖరీదు ఎంతో తెలుసా ఏకంగా మూడు వేల కోట్ల రూపాయలట !! ఈ స్థాయిలో నారోటిక్ డ్రాగ్స్ పట్టుబడడం ఈ దేశంలో ఇదే మొదటి సారి. ఇటీవలే రాజస్థాన్ లోని ఉదయ్ పుర్ సమీపంలో మరుధర్ డ్రాగ్ కంపెనీ పై డి ఆర్ ఐ అధికారులు దాడి చేసారు. అందులో నిషేదిత మ్యాండక్ష టాబ్లెట్స్ అత్యధికంగా నిల్వ ఉన్నట్టు గుర్తించారు ? ఈ టాబ్లెట్స్ ఖరీదు బయట మార్కెట్ లో అయితే ఏకంగా 4500 కొట్లట? అయితే ఈ డ్రగ్ వ్యవహారంలో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా ? బాలీవుడ్ నిర్మాత సుభాష్ దుదానిని, ఆయనను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఒక రెస్పాన్సిబుల్ నిర్మాత అయి ఉండి జనాలకు కీడు చేసే ఇలాంటి డ్రాగ్ ని అయన తయారు చేయడం నిజంగా ఎంత ధారుణమో కదా !!