సీరియల్ నటి బికినిలో షాక్ ఇచ్చిందేంటి!

Tuesday, January 2nd, 2018, 05:45:47 PM IST

ఒకప్పుడు సీరియల్ లో నటించే నటీమణులు ఎంత సింపుల్ గా ఉండేవారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఈ రోజుల్లో మాత్రం పరిస్థితి అలా లేదు. ఏ మాత్రం లిమిట్స్ లేకుండా సోషల్ మీడియాలో సీరియల్ హీరోయిన్స్ చాలా ఘాటుగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం రోజుల్లో సినిమాల్లో నటిస్తోన్న హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా బికినీ ఫోజులతో ఫొటో షూట్స్ లలో పాల్గొంటున్నారు. అయితే రీసెంట్ గా ఒక సీరియల్ నటి కూడా అదే తరహాలో నవ్వుతూ బికినిలో కనిపించింది. ఏ మేరి లైఫ్ హై సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయినా శామా సికందర్ కొన్నాళ్లకే పాపులర్ అయ్యింది. ఆ తరువాత పలు రియాలిటీ షోల ద్వారా కెరీర్ ను బాగానే నెట్టుకొచ్చి బుల్లితెర స్టార్ గా ఎదిగింది. అయితే రీసెంట్ గా ఎవరు ఊహించని విధంగా బికినిలో కనిపించి అందరిని ఆశ్చర్యపరచింది. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి.