పంటలను తింటున్న మిడతల దండు పై బాలీవుడ్ స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్!

Thursday, May 28th, 2020, 01:27:22 PM IST


గత కొద్ది రోజుల నుండి మిడతలు గుంపులు గుంపులు గా చేరి పంటలను నాశనం చేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో ఈ జరుగుతున్న ఈ ఘటన ల పై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇవే మిడతలు తెలంగాణ రాష్ట్రానికి కూడా చేరే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అంతేకాక ఇవి తమ శరీర బరువు కంటే ఎక్కువగానే తింటాయి అని కొందరు అంటున్నారు. 35 వేల మంది తినే ఆహారం ను ఇవి ఒక్క రోజులోనే ఆమ్ ఫట్ చేసేస్తున్నాయి.

అయితే వీటిని తరిమి కొట్టడం అసాధ్యం కావడం తో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో ధర్మేంద్ర డియోల్ మిడతల పట్ల జాగ్రత్తగా ఉండండి అని అన్నారు. తన పదవ తరగతి లో ఉన్నపుడు ఇలాంటి పరిస్తితి నే ఎదుర్కొన్నాము అని వ్యాఖ్యానించారు. తను చదివే రోజుల్లో వీటిని చంపడానికి విద్యార్థులందరిని పిలిచారు అని అన్నారు. అయితే దీనికి సంబంధించిన ఒక వీడియో సైతం సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు ధర్మేంద్ర డియోల్.

కొందరు మాత్రం పలు చోట్ల పెళ్లికి, పలు కార్యక్రమాలకు ఉపయోగించే డీజే సౌండ్ సిస్టమ్ ద్వారా వీటిని తరిమి కొడుతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇవి దాడులు చేస్తూనే ఉన్నా, ఇపుడు మాత్రం భారీ స్థాయిలో దాడి చేస్తున్నాయి అని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్ళ ముందే తమ పంటలను కోల్పోతున్నాం అని అన్నారు.