ఐటెం గర్ల్ గా మారిన బాలీవుడ్ హీరోయిన్ ?

Tuesday, November 8th, 2016, 01:27:17 PM IST

amisha-patel
అప్పట్లో సంచలన హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకున్న ఈ హాట్ భామ, తన అందం .. గ్లామర్ తో ఆకట్టుకుని ఒకానొక టైంలో టాప్ హీరోయిన్ గా వెలిగింది. ఆ తరువాత కెరీర్ లో వరుస పరాజయాలు పలకరించడంతో .. పాపం క్రేజ్ తగ్గింది? ఇంతకీ ఎవరా హీరోయిన్ ? అని అనుకుంటున్నారా ఆమె ..ఎవరో కాదు అమీషా పటేల్!! ‘కహో నా ప్యార్ హై’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత కుర్రకారు హృదయాల్లో ప్రకంపనలు రేపిన ఈ భామ హిందీలో పలు సినిమాలు చేసింది, తెలుగులో మహేష్ ‘నాని’, ఎన్టీఆర్ ‘నరసింహుడు’ , పవన్ ‘బద్రి’, బాలయ్య ‘పరమ వీర చక్ర’ సినిమాల్లో నటించింది. ఆ సినిమాల్లో ఒక్క ‘బద్రి’ తప్ప మారేది ఆడలేదు. దాంతో సౌత్ లోకూడా కలిసి రాని ఈ భామ మళ్ళీ బాలీవుడ్ లోనే ఉండిపోయింది. అక్కడ అడపా దడపా సినిమాలు చేస్తున్న అమీషా లేటెస్ట్ గా తెలుగులో ఐటెం గర్ల్ గా రీ ఎంట్రీ ఇస్తుంది ? ”ఆకతాయి” అనే సినిమాలో అమీషా ఐటెం సాంగ్ చేస్తుందట !! ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది, త్వరలోనే అమీషా సాంగ్ చిత్రీకరిస్తారట !! మరి ఈ ‘ఆకతాయి’ సినిమాతో అమీషా టాలీవుడ్ లో సెటిల్ అవుతుందో లేదో చూడాలి !!