15 నిమిషాలకు 5 కోట్లా..? వేస్కునేవా..తీస్కునేవా..?

Tuesday, March 27th, 2018, 08:31:20 PM IST

బాలీవుడ్ యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ స్టార్ హీరో రణ్‌వీర్‌సింగ్. ఐపీఎల్ లాంచింగ్ ప్రోగ్రామ్‌కు ముఖ్య అతిథిగా హజరవ్వాలని కోరారు. దీనికి ఆయన 15 నిమిషాలకు 5 కోట్ల రెమ్యూనరేషన్‌ కావాలన్నాడట. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నది. ప్రతిసారిలాగే ఈ సారికి సినిమా తారలతో ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా చేయాలని అనుకున్నారు నిర్వాహకులు. తారలొస్తే ప్రేక్షకులకు మరింత వినోదం అందించొచ్చని భావించి యువత మంచి క్రేజ్ ఉన్న రణ్‌వీర్‌సింగ్‌ని కలిశారు. పావుగంట ప్రదర్శనకోసం ఈ కుర్ర హీరో ఐదు కోట్లు డిమాండ్ చేశాడట. అందుకు ఐపీఎల్ నిర్వాహకులు అంగీకారం కూడా తెలిపారు. ఐపీఎల్ 11వ సీజన్ మొదటి మ్యాచ్ ఏప్రిల్ 7న స్టార్ట్ కాబోతుంది. దీపం మంచిగున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను చాలావరకు స్టార్లు పాటిస్తుంటారు. రణ్‌వీర్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. స్టార్డం ఉన్నప్పుడే డబ్బులు సంపాదించడానికి చాన్సు ఉంటుందని, ఈ అవకాశం పొతే మళ్ళీ రాదని ఇంత భారీ మొత్తంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో అని క్రికెట్ అసోసియేషన్ అధికారులు ఆలోచిస్తున్నారట.