అంబానీ యంగేజ్‌మెంట్ పార్టీలో బాలీవుడ్ స్టార్స్

Tuesday, March 27th, 2018, 10:19:51 PM IST

ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నికుడిగా విరాజిల్లుతున్న రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి భాజా అంటే మామూలుగా ఉంటుందా? ఆకాశ‌మంత పందిరేసి, ఊరూ వాడా సంబ‌రాలు చేయ‌డం చాలా కామ‌న్ మ్యాట‌ర్‌. అయితే ఆకాశ‌హార్మ్యంలో నివాసం ఉంటున్న అంబానీ, పెళ్లి వేడుక‌లు అంటే అంత‌కంటే పైనే పందిరేయాల్సి ఉంటుంది. ఇటీవ‌లే అంబానీ సుపుత్రుడి యంగేజ్‌మెంట్ కార్య‌క్ర‌మంలో గోవాలో ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

ముఖేష్ అంబానీ త‌న‌యుడు ఆకాష్ అంబానీ- శ్లోకా మెహ‌తాల నిశ్చితార్థం పూర్త‌యిన వేళ ఆనందోత్సాహాల్లో ఉన్న ఆ కుటుంబం ముంబైలో ఘ‌న‌మైన పార్టీ ఏర్పాటు చేసింది. ఈ విందు కార్య‌క్ర‌మంలో కింగ్ ఖాన్ షారూక్‌- గౌరీఖాన్ దంప‌తులు, క‌ర‌ణ్ జోహార్‌, ఐశ్వ‌ర్యారాయ్ బ‌చ్చ‌న్‌- ఆరాధ్య బ‌చ్చ‌న్‌, జ‌హీర్‌ఖాన్ – సాగ‌రిక దంప‌తులు, రాజ్ కుమార్ హిరాణీ, జాన్ అబ్ర‌హాం త‌దిత‌ర బాలీవుడ్‌ సెల‌బ్రిటీలు పాల్గొన్నారు. అమీర్ ఖాన్ భార్య కిర‌ణ్‌రావు ఈ విందుకు ఎటెండ‌య్యారు. వేడుక‌లో ఐష్ త‌న కుమార్తె ఆరాధ్య స‌మేతంగా మెరుపులు మెరిపించ‌డం హైలైట్‌