డబ్బుకోసం నటీనటులు దిగజారుతున్నారంటున్న ధర్మేంద్ర ?

Saturday, December 2nd, 2017, 11:02:24 AM IST

ప్రస్తుతం సినిమా పరిశ్రమ పరిస్థితి మరి దారుణంగా తయారైంది. ఎలా అంటే కూరగాయల మార్కెట్ లా మారిందని అంటున్నాడు ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ? ప్రస్తుతం అమ్మడం, కొనడం. బేరసారాలతోనే నటీనటులు సరిపెట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు!! ఇక్కడ కేవలం డబ్బే ప్రాముక్యంగా మారిందని, డబ్బు ఎక్కడ ఉంటె అక్కడికి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారని .. చివరికి ఆయిల్ మసాజ్ లకు సిద్ధం అవుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే తమ కాలంలో ఇలా ఉండేది కాదని అన్నారు. అలాగే అవార్డుల విషయంలో అయన మాట్లాడుతూ .. ఇక్కడ కొన్ని విషయాల గురించి చర్చించుకోవడమే మంచిదని అన్నారు. సినిమాల్ నటించామా లేదా.. దాన్ని ప్రజలు ఆదరిస్తే అదే పెద్ద అవార్డు అని అన్నారు. తాజాగా ఓ కార్యక్రమాల్లో పాల్గొన్న అయన ఈ వ్యాఖ్యలు చేసారు.

  •  
  •  
  •  
  •  

Comments