చెప్పుల‌రిగిపోయిన టాప్ డైరెక్ట‌ర్‌!

Monday, March 12th, 2018, 10:51:50 PM IST

ఒక్కోసారి ఇండ‌స్ట్రీలో ఎలాంటి స‌న్నివేశం ఉంటుందో ఇదో ఎగ్జాంపుల్‌. ఒక‌ప్పుడు టాప్ డైరెక్ట‌ర్ అన్న పేరు తెచ్చుకున్నా.. ఇప్పుడు స‌క్సెస్‌లో లేక‌పోతే ఇండస్ట్రీ ఎలా చూస్తుందో ఇంత‌కంటే ఎగ్జాంపుల్ అక్క‌ర్లేదు. బొమ్మ‌రిల్లు చిత్రంతో బంప‌ర్ హిట్ అందుకున్న భాస్క‌ర్ .. సౌత్ ఇండ‌స్ట్రీస్‌లోనే వన్ ఫిలిం వండ‌ర్‌గా మిగిలిపోయాడు. బొమ్మ‌రిల్లు చిత్రంతో అత‌డికి గొప్ప పేరొచ్చింది. కానీ ఎందుక‌నో ఆ త‌రవాత అత‌డిని దుర‌దృష్టం శ‌నిలా వెంటాడింది. చేసిన ఒక్క సినిమా కూడా హిట్ట‌వ్వ‌లేదు. పైగా `ఆరెంజ్‌` లాంటి డిజాస్ట‌ర్ తీసినందుకు ఎన్నో చీవాట్లు తినాల్సొచ్చింది. అదంతా అటుంచితే, ప్ర‌స్తుతం భాస్క‌ర్ గాడి త‌ప్పిన త‌న కెరీర్‌ని ఎలా అయినా గ‌ట్టెక్కించాల‌ని నానా తంటాలు ప‌డుతున్నాడు.

ఆ క్ర‌మంలోనే భాస్క‌ర్ ఇటీవ‌ల గీతా ఆర్ట్స్ చుట్టూ తిరిగాడ‌న్న ప్ర‌చారం సాగింది. అయినా అక్క‌డ స్క్రిప్టు ఓకే చేయించుకోలేక‌పోయాడు. ఆ క్ర‌మంలోనే మ‌రో అగ్ర నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌లో క‌థ వినిపించాడు. అక్క‌డ వెంకీతో సినిమా చేయాల‌ని ప్లాన్ చేసినా, అదీ వ‌ర్క‌వుట‌వ్వ‌లేద‌ని తెలుస్తోంది. ఆ రెండు నిర్మాణ సంస్థ‌లు పెద్ద ఛాలెంజింగ్ టాస్క్స్‌. అక్క‌డ స్క్రిప్టుతో ప‌డేయ‌డం అంటే అంత వీజీ ఏం కాదు. ఆ క్ర‌మంలోనే నిరాశ‌తో వెనుదిరిగిన భాస్క‌ర్ త‌దుప‌రి హీరో గోపిచంద్‌కి క‌థ వినిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. మొత్తానికి విక్ట‌రీ వెంక‌టేష్ తేజ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించేందుకు వెళుతుంటే, భాస్క‌ర్ ఇలా హీరోలను వెతుకుతున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments