కంక్లూజన్ : బోండా రివర్స్ గేర్ వేశాడు..అతడే కారణం..!

Tuesday, August 13th, 2019, 11:07:05 AM IST

తెలుగుదేశం పార్టీకి చెందిన బోండా ఉమా గత కొద్దీ రోజుల నుండి ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ లోకి వెళ్ళిపోతాడనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. విదేశాల్లో వున్నా బోండా ఉమా ఇండియా రాగానే పార్టీ మారిపోతాడని, ఇప్పటికే వైసీపీతో డీల్ సెట్ చేసుకున్నాడంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇండియా వచ్చిన బోండా ఉమా దీనిపై మరోలా స్పదించాడు. ఆయన వచ్చిన వెంటనే టీడీపీ పార్టీ తరపున బుద్ధా వెంకన్న వెళ్లి కలవటం, ఆ తర్వాత బోండా వెళ్లి బాబుని కలిసిన తర్వాత పార్టీ మారేది లేదంటూ తేల్చిచెప్పాడు.

అయితే ఈ టోటల్ ఎపిసోడ్ లో బోండా ఉమా పార్టీ మరలనుకున్నాడు అనేది వాస్తవం. వైసీపీ లోకి వస్తే తనకి విజయవాడ సెంట్రల్ కావాలని అడిగాడు. అయితే అక్కడ మల్లాది విష్ణు ఉండటంతో తూర్పు ఇస్తామని చెప్పారు.అయితే అక్కడ బలమైన నేతలు ఉండటంతో బోండా ఉమా కొంచం ఆలోచించాడు. ఇదే సమయంలో వైసీపీ దేవినేని అవినాష్ ని కూడా పార్టీలోకి పిలిచినట్లు తెలిసింది. దీనితో బోండాకి వైసీపీ లో ఎదో జరుగుతుందని అర్ధం అయ్యింది.

టీడీపీని కాదని వైసీపీ లోకి పొతే అక్కడ సరైన గౌరవం లభించదని ఒక అంచనాకి వచ్చాడు. వైసీపీలోకి వెళ్ళిపోతే రెండిటికి చెడ్డ రేవడిలా మారిపోతానని భయపడ్డాడు. గతంలో యలమంచి రవికి పట్టిన గతి తనకి పట్టవచ్చని ఆగిపోయాడు. దానికి తోడు విజయవాడ సెంట్రల్ లో ఉన్న టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు వైసీపీ లోకి రావటానికి ససేమిరా అనేశారు. దీనితో బోండా తిరిగి టీడీపీ లోనే ఉండాలని ఫిక్స్ అయ్యాడు.