పలు టైటిల్స్ తో ఆసక్తి రేపుతున్న శ్రీదేవి బయోపిక్ ?

Tuesday, May 8th, 2018, 03:17:07 PM IST

అందాల తార శ్రీదేవి ఆకస్మిక మరణం ఆమె అభిమానులను ఎంతగానో బాధించింది. ఇప్పుడు ఆమె జీవిత కథతో సినిమా చేయడానికి శ్రీదేవి భర్త బోణి కపూర్ సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న అయన ఈ సినిమాకోసం పలు టైటిల్స్ ని రిజిస్టర్ చేయించారు. అందులో శ్రీ , శ్రీదేవి, శ్రీ మేడం, లతో పాటు చాల్ బాజ్, రూప్ కి రాణి చోరోంకా రాజా, జాన్ బాజ్ మిస్టర్ ఇండియా లాంటి పలు టైటిల్స్ ఆమెకోసం రిజిస్టర్ చేయించారని, కథ ప్రకారం ఏ టైటిల్ అయితే అది పెట్టె ఆలోచనలో బోణి కపూర్ ఉన్నాడు. ఫిబ్రవరి 24న దుబాయ్ లో బాత్ టాబ్ లో పడి ప్రమాదవశాత్తు మరణించిన శ్రీదేవి జీవితం పై ఇప్పటికే సంచలన దర్శకుడు వర్మ, హన్సాల్ మెహతా లాంటి దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఎవరి సినిమా ముందు సెట్స్ పైకి వస్తుందో చూడాలి. అంతకంటే ముక్యంగా శ్రీదేవి పాత్రలో ఎవరు నటిస్తారా ? అన్నది ఆసక్తికరంగా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments