మరో తమిళ దర్శకుడితో మహేష్ సినిమా ?

Thursday, September 29th, 2016, 12:44:09 PM IST

mahesh-babu
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చెన్నై లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తరువాత మహేష్, కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. డిసెంబర్ లో ఈ సినిమా మొదలు కానుంది. ఇక ఈ సినిమా తరువాత మహేష్ మరో తమిళ దర్శకుడితో సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్టు కోలీవుడ్ లో జోరుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. ”రాజారాణి” , ”పోలీస్” సినిమాలతో దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు అట్లీ వద్ద సహాయకుడిగా పనిచేసిన బాస్కో దర్శకత్వం వహిస్తాడని, ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ నిర్మాత, ఇటీవలే రజని తో ”కబాలి” చిత్రాన్ని నిర్మించిన కలైపులి థాను తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తాడట !! ఇప్పటికే కథ చర్చలు కూడా జరుగుతున్నట్టు సమాచారం. నిర్మాతతో బాస్కో కథ చర్చలు జరిపాడని, ఇప్పటికే నిర్మాత థాను కూడా మహేష్ తో కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. సో .. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన వివరాలు వెల్లడి కానున్నాయి.