జగన్‌ని అందుకే పిలవలేదు.. ట్రంప్ విందుపై బొత్స కౌంటర్..!

Wednesday, February 26th, 2020, 05:56:47 PM IST


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా పర్యటనకు వచ్చి వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌కి ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి కొందరి ముఖ్యమంత్రులకు మాత్రమే ఆహ్వానం అందింది. తెలంగాణ సీఎం కేసీఆర్, హర్యానా సీఎం మనోహర్ ఖట్టర్, కర్ణాటక సీఎం యడియూరప్ప, అస్సాం సీఎం సర్బానంద సోనోవాల్‌లకు ఈ విందుకు ఆహ్వానం అందింది. అయితే ఈ విందుకు ఏపీ సీఎం జగన్‌కి ఆహ్వానం అందకపోవడంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి.

అయితే ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ ట్రంప్‌తో విందుకు జగన్‌ని పిలవకపోవడంపై స్పందించారు. దేశంలోనే జగన్ బలమైన సీఎం అని అందుకే ఆయనను పిలవలేదని అన్నారు. అయితే జగన్‌తో పాటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌లకు కూడా ఆహ్వానం అందలేదని మొదటి సారి సీఎం అయినందుకే జగన్‌ని ఆహ్వానించలేదని అనుకుంటే వారంతా సీనియర్లు కదా వారిని ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాలని ప్రశ్నించారు. అనవసరంగా ఈ విషయాన్ని ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు.