అమరావతిపై సంచలన వాఖ్యలు చేసిన బొత్స – అందుకే చంద్రబాబు భయపడుతున్నారా…?

Saturday, August 24th, 2019, 12:37:01 AM IST

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం మీద, ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు… గతంలో కూడా బొత్స సత్యనారాయణ ఇలాంటి వాఖ్యలే చేశారు. కాగా బొత్స చేసిన ఈ వాఖ్యల కారణంగానే టీడీపీ మరియు వైసీపీ మధ్యన ఒక రేంజ్ లో మాటల యుద్ధం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఓ దశలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లరావు అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే అందరం కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఆ వివాదం ఇంకా సద్దుమణగక ముందే ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ మరొకసారి అమరావతి పై కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. అంతేకాకుండా తాను రాజధాని నిర్మాణంపై చేసిన వాఖ్యలను టీడీపీ నేతలు వక్రీకరించారని బొత్స సత్యనారాయణ పలు విమర్శలు చేస్తున్నారు.

అయితే ఈమేరకు మాట్లాసిన బొత్స… ఆనాడు రాజధానిలో సంభవించిన వరదల గురించే తాను మాట్లాడానని, కానీ అందరు కూడా రాజధాని విషయంలో నేనేదో తప్పుగా మాట్లాడానని చెప్పారని అంటున్నారు. అయితే గత టీడీపీ ప్రభుత్వం ఆనాడు శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టును అసలే పరిగణనలోకి తీసుకోలేదని, కేవలం నారాయణ రిపోర్టును అమలు చేశారని బొత్స ఎద్దేవా చేశారు. ఇకపోతే తడో అధినేత చంద్రబాబు ఇపుడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారుల మారారని, అమరావతి చుట్టూ రియల్ ఎస్టేట్ కి సంబందించిన వ్యాపారం చాలా ఉంది కాబట్టే చంద్రబాబు ఇప్పటికి భయపడుతున్నారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇకపోతే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ది జరగాలని, తద్వారా రూ.25లక్షల కోట్ల సంపదను సృష్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.