సొరకాయతో శృంగార సామర్ధ్యం! ఎలా అంటే?

Tuesday, July 25th, 2017, 09:44:38 AM IST


శారీరక ధృడత్వం లేకపోతే సంసార బంధంలో భార్య భర్తల మధ్య లైంగిక పరకమైన సమస్యలు ఉత్పన్నం అవుతాయి. శరీరంలో అన్ని జీవ క్రియలు క్రమమైన పద్ధతిలో పని చేసినపుడే లైంగిక వ్యవస్థ కూడా సక్రమంగా ఉంటుంది. అయితే ఫార్మ మెడిసన్ కంటే శారీరక సామర్ధ్యం, లైంగిక సామర్ధ్యం పెంచుకోవడానికి మన ఆయుర్వేదిక ఔషధాలో, అది కూడా మనం రోజు వారి తీసుకునే కూరగాయలు ఎంతో ఉపయోగపడతాయని మన శాస్త్ర గ్రంధాలలో ఉంది. వాటిలో సొరకాయలో జీవ కియ్రల్ని క్రమబద్ధం చేసే అంశాలు పుష్కలంగా ఉండటం వలన పురుషులలో లైంగిక సామర్ధ్యం పెరుగుతుందని తాజా అధ్యయనంలో తెలిసింది.
వీర్యవృద్ధిని కలిగించడంలో సొరకాయ గింజల పాత్ర కీలకంగా ఉంటాయని సమాచారం. సొరకాయ ముదురు గింజలను వేయించి, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాలు జీలకర్ర కలిపి నూరి కొంచెం అన్నంతో కలిపి తీసుకుంటే.. లైంగిక శక్తి పెరుగుతుంది. దీని వల్ల శారీరక దారుఢ్యం కూడా వృద్ధి చెందుతుంది. సొరకాయ శరీరంలోని వేడినీ, కఫాన్నీ తగ్గిస్తుంది. వాంతులు, విరేచనాలు, పేగుపూత వంటి సమస్యలు ఉన్నవారు సొరకాయను తరుచూ తింటే ఎంతో మేలు కలుగుతుందని వైద్యులు కూడా చెబుతున్నారు. హృదయ సంబంధ వ్యాధులను అరికట్టడంలో సొరకాయ కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ తరుచూ తింటే జలుబు చేస్తుందనుకుంటే… శొంఠిపొడిని గానీ, మిరియాల పొడిని గానీ కలిపి తీసుకుంటే మంచి గుణం కనిపిస్తుందని అంటున్నారు.