ఆడుకోనివ్వడం లేదని అమ్మమ్మపైనే కేసు పెట్టిన బాలుడు

Wednesday, December 28th, 2016, 12:51:59 PM IST

boy
మనదేశంలో కార్పొరేట్ స్కూల్స్ వచ్చాక చదువు కూడా వ్యాపారంలా మారిపోయింది. ర్యాంకుల పేరుతొ విద్యార్థులకు చిన్నతనం నుండే చదువు తప్ప వేరే వ్యాపకం లేకుండా పెంచుతున్నారు. స్కూల్ లో ఉన్నంతసేపు చదవడం, మళ్ళీ ఇంటికొచ్చాక ట్యూషన్లు, హోమ్ వర్క్ లు అంటూ పేరెంట్స్ వేధింపులు తప్పట్లేదు. ఈ చిన్నారులకు బయటకు వెళ్లి కొంచెంసేపు స్నేహితులతో ఆదుకోవడానికి కూడా సమయం దొరకట్లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఒక బాలుడు తన అమ్మమ్మపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు.

స్కూల్ నుండి ఇంటికొచ్చాక తన అమ్మమ్మ తనను ఆడుకోనివ్వడం లేదని ఒక బాలుడు ఏకంగా పోలీస్ స్టేషన్లోనే కేసు పెట్టాడు. తన మనవడు తమ కేసు పెట్టడంతో ఆందోళన చెందిన బాలుడి అమ్మమ్మ, తల్లితండ్రులు ఆడుకునేందుకు హామీ ఇచ్చి, చాకోలెట్స్ ఇచ్చి కేసును వెనక్కు తీసుకునేలా చేశారు. ఈ సంఘటన ప్రతీ తల్లితండ్రులకు కనువిప్పు కలిగించేదిగా ఉంది. ఈ సంఘటన చూసైనా తమ పిల్లలకు ఆదుకోవడానికి సమయం ఇవ్వాలని తల్లితండ్రులు గుర్తించాలి.

  •  
  •  
  •  
  •  

Comments