ఎన్టీఆర్ ‘దమ్ము’ చూపించడానికి మరోమారు ‘సరైనోడు’ రెడీ..?

Saturday, September 17th, 2016, 11:29:56 AM IST

ntr-boyapati
”జనతా గ్యారేజ్” హిట్ తో మాంచి జోష్ మీదున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద డెబ్భై కోట్ల మార్కెట్ ని కొల్లగొట్టింది. ఇక ఈ సినిమా తరువాత నెక్స్ట్ ఏమిటనే ఆలోచనలో పడ్డాడు ఎన్టీఆర్. ఇప్పటికే రచయిత వక్కంతం వంశీ తో సినిమా అనుకున్నారు కానీ అది వర్కవుట్ కాలేదు, దాంతో పూరితో చేయాలనీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ లోగా ”పటాస్” తో ఫామ్ లోకి వచ్చిన అనిల్ రావిపూడి కూడా ఓ కథ సిద్ధం చేసి ఎన్టీఆర్ కు వినిపించాడు. అలాగే తమిళ దర్శకుడు లింగుస్వామి కూడా ఓ వైపు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మూడింటిలో ఏది చేద్దామనే ఆలోచనలో ఉండగెనే .. ఇప్పుడు మరో దర్శకుడు ఎంట్రీ ఇచ్చాడు .. అతనే బోయపాటి శ్రీను? లెటస్ట్ గా ”సరైనోడు” సినిమాతో హిట్ అందుకున్న బోయపాటి, ఎన్టీఆర్ తో సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు. ఇదివరకే ఎన్టీఆర్ తో ”దమ్ము” చిత్రాన్ని తీసాడు. ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా బోయపాటికి మంచి మార్కులే పడ్డాయి. దాంతో బోయపాటి తో సినిమా చేస్తే మళ్ళీ మాస్ ఇమేజ్ తెసీసుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నాడట ఎన్టీఆర్. త్వరలోనే కథ కూడా వినిపించాలని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు బోయపాటి .. మరి ఈ సినిమాల్లో ఎన్టీఆర్ ఏ సినిమా చేస్తాడో అన్నది అయన ఫాన్స్ కు ఆసక్తి గా మారింది ?