బాలకృష్ణతో బోయపాటి సినిమా కన్ఫర్మ్ ?

Tuesday, December 5th, 2017, 03:35:01 PM IST

బాలయ్య కు తగ్గట్టుగా ఎమోషన్ ని సరిగ్గా వాడేస్తూ .. అసలైన హీరోయిజాన్ని చూపిస్తూ బాలయ్యతో తెరకెక్కించిన రెండు సినిమాలతో సంచలన విజయాలను అందుకున్నాడు దర్శకుడు బోయపాటి. సింహా .. లెజెండ్ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దడదడలాడించాయి. దాంతో వీరిద్దరి కాంబినేషన్ కు క్రేజ్ పెరిగింది. తాజాగా ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాకు రంగం సిద్ధం అయింది ? ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమాకు కమిట్ అయినా బోయపాటి .. ఆ నెక్స్ట్ సినిమాను బాలయ్యతో చేస్తాడట. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథ చర్చలు జరిగినట్టు టాక్ !! అయితే బాలకృష్ణ – మహేష్ లతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి .. అయితే ప్రస్తుతం మల్టి స్టారర్ల సినిమా పక్కకు వెళ్లడంతో బాలయ్యతో సినిమా కన్ఫర్మ్ అయిందట. చరణ్ సినిమా పూర్తీ కాగానే బాలయ్యతో సినిమా మొదలు పెడతాడట. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments