బోయపాటి – ఎన్టీఆర్ కాంబినేషన్ కి అడ్డం పడుతోంది ఎవరు ?

Friday, September 30th, 2016, 03:14:41 PM IST

ntr-boyapati
టెంపర్ , నాన్నకు ప్రేమతో , జనత గ్యారేజ్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ సాధించిన హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన నాల్గవ సినిమా ఏ డైరెక్టర్ తో సంతకం చేస్తాడు అనేది ప్రశ్న . మీడియా లో మాత్రం ఒక్కొక్కరోజు ఒక్కొక్క పేరు బయటకి ఒస్తూ ఉంది. ఒకరోజు బోయపాటి శ్రీను అనీ , మరొక రోజు వక్కంతం వంశీ అనీ ఇలా ఇష్టం వచ్చినట్టు చెబుతోంది మీడియా. ఈ క్రమం లో దమ్ము సినిమాతో ఎన్టీఆర్ కి ఫుల్ హైప్ ఇచ్చి సినిమా మాత్రం నీరు గార్చేసిన బోయపాటి శ్రీను ఎన్టీఆర్ తో ఎలాగైనా హిట్ కొట్టాలి అనే ఉద్దేశ్యం తో ఉన్నాడట. ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గట్టుగా యొక సూపర్ స్టోరీ ని సిద్దం చేస్తున్న బోయపాటు రేపో మాపో ఎన్టీఆర్ ని కలవబోతున్నాడు అంటున్నారు. ఎన్టీఆర్ కూడా వరస హిట్ ల తరవాత ఒక స్ట్రాంగ్ పాయింట్ తో ఉన్న కథనే ఎంచుకోవాలని చూస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ – బోయపాటి లకి అడ్డంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో బోయపాటి ఇచ్చిన కమిట్మెంట్ ఉండిపోయింది. ఇప్పటికే వారి సినిమాని కాదు అని బోయపాటి తప్పించుకుని తిరిగుతున్నారు , ఎప్పుడో ఇచ్చిన అడ్వాన్స్ మేరకు ఈ సినిమా చెయ్యాల్సిందే మరి.