నా మనసులో దీపిక మాత్రమే ఉంది: క్రికెటర్

Saturday, May 19th, 2018, 03:43:44 PM IST

బాలీవుడ్ నటీమణి దీపిక పదుకొనె అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. ఆమె గ్లామర్ కి కుర్రకారు ఫిదా అయిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నటనలో తనకు తానే సాటి అనే విధంగా పద్మావత్ సినిమాతో నిరూపించింది. ఇక ఫొటో షూట్స్ తో అప్పుడపుడు వైరల్ అవ్వడం కామన్. అయితే ఆమెను చూసి వెస్ట్ ఇండీస్ క్రికెటర్ ఎప్పుడో పడిపోయాడట. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న బ్రావో ఇటీవల హర్భజన్ తో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

అయితే తనకు ఇష్టమైన హీరోయిన్ దీపికా పదుకొనె అని తన మనస్సులో ఆమెకి గుడి కట్టుకున్న అనే లెవెల్లో చెప్పాడు. అంతే కాకుండా ఎప్పటికైనా తనను ఒకసారి కలుసుకోవాలని బ్రావో చెబుతూ.. మొట్ట మొదటి సారి దీపికను చుసిన విషయం గురించి చెప్పాడు. 2006 ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా ఇండియా వచ్చినప్పుడు హోటల్ గదిలో టివి చూస్తుండగా ఒక సోప్ యాడ్ వచ్చింది. అందులో కనిపించిన దీపికకు అప్పుడే నా మనసులో స్థానాన్ని ఇచ్చేశాను అని బ్రావో చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments