బ్రేకింగ్ న్యూస్ : ఇండియన్ ఫిలిం హిస్టరీలో భరత్ సంచలన రికార్డు!

Tuesday, April 10th, 2018, 06:35:51 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కైరా అద్వానీ జంటగా కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం భరత్ అనే నేను. శ్రీమంతుడు తర్వాత మహేష్ కొరటాల కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం కావడం , మొదటిసారి మహేష్ ముఖ్య మంత్రి పాత్రలో కనిపిస్తుండడం తో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే ఇప్పటికే విడుదలయిన టీజర్లు, సాంగ్స్ నంబర్స్‌కు శ్రోతలనుండి విశేషమైన స్పందన వస్తున్నది. అలాగే ట్రైలర్ ‘ ది జర్నీ ఆఫ్ భరత్ ‘ ఒక సంచలనమే అని చెప్పాలి. అయితే భారత చలన చిత్ర చరిత్రలో ఏ సినిమా కూడా నెలకొలపని రికార్డ్ ను భరత్ అనే నేను సొంతం చేసుకోబోతుంది.

అది కూడా ఆస్ట్రేలియాలో. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా విడుదల అవ్వనన్ని చోట్ల, అన్ని థియేటర్లలో భరత్ అనే నేను విడుదల కాబోతుంది. ఓ భారతీయ సినిమా ఇంత భారీ ఎత్తున అత్యధిక లొకేషన్లలో అక్కడ రిలీజ్ కావడం చరిత్రలో ఇదే ప్రప్రథమం. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయి క్రేజ్ ఉంటుందో అలానే ఓవర్సీస్ లో కూడా అదే స్థాయి క్రేజ్ ఉంటుంది. ఆయన కొన్ని ప్లాప్ చిత్రాలుకూడా ఓవర్సీస్ లో 1 మిలియన్ డాలర్లు కొల్లగొట్టాయంటేనే తెలుస్తోంది అక్కడ ఆయనకున్న ఫాలోయింగ్, క్రేజ్ ఎటువంటిదో.

ఆ క్రేజ్ మూలానే ఆయన తాజా చిత్రం ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడ భారీ స్థాయిలో జరిగింది. యూఎస్‌లో కనీవినీ ఎరుగని విధంగా రిలీజ్ అవుతున్న భరత్ అనే నేను చిత్రం ఆస్ట్రేలియా లో కూడా అదే స్థాయిలో విడుదల అవనుండడంతో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ట్రేడ్ పండితులు వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో కేవలం ప్రీమియర్స్ షోలే దాదాపు 2000 షోలు ప్లాన్ చేసారంటే సినిమా ఏ స్థాయి లో రిలీజ్ అవుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ భారీస్థాయి విడుదల వలన రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి. కాగా డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 20న భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న విషయం తెలిసిందే…..

  •  
  •  
  •  
  •  

Comments