బ్రేకింగ్ న్యూస్ : రాజమౌళికి అతిపెద్ద షాక్!

Wednesday, May 9th, 2018, 08:25:54 PM IST

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన లేటెస్ట్ బ్లాక్బస్టర్ మూవీ బాహుబలి కంక్లూషన్. ఈ చిత్రం ఇప్పటివరకు దాదాపు రూ.1700 కోట్లు పైచిలుకు కలెక్షన్ సాధించింది. అయితే గతకొద్దినెలలుగా ఈ చిత్రం చైనాలో ఎప్పుడు విడుదల చేస్తారా అని అక్కడి అభిమానులు ఎదురు చూపులు చూసారు. ఇన్నాళ్లకు ఆసమయం రానే వచ్చింది. ఈనెల 4వ తేదీన ఈ చిత్రం చైనాలో 7వేల స్క్రీన్ లలో భారీ అంచనాల మధ్య విడుదలయింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం అక్కడ దారుణమైన ఫలితాన్ని, కలెక్షన్లను రాబడుతున్నట్లు తెలుస్తోంది. దంగల్ చిత్రం చైనాలో మొత్తం రూ.1200 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. ఆ చిత్ర కలెక్షన్లను బాహుబలి2 దాటేస్తుందని అందరూ భావించారు.

కాగా బాహుబలి2 ఇప్పటివరకు కేవలం రూ.63 కోట్లు మాత్రమే రాబట్టిందని భారతీయ సినీ విశ్లేషకుడు తరన్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. దీన్నిబట్టి చూస్తే ఈ చిత్రం టోటల్ రన్ లో కూడా చాలా తక్కువ మొత్తం మాత్రమే రాబట్టే అవకాశం కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. మనదేశంలో యావరేజ్ టాక్ తెచ్చుకున్న అమీర్ నటించిన లేటెస్ట్ మూవీ సీక్రెట్ సూపర్ స్టార్ చైనాలో రూ.700 కోట్లు వసూలు చేసింది. చూడబోతే బాబుబలి2 అక్కడ అందులో సగం కూడా కలెక్షన్లు సాధించలేదనేది కొందరి వాదన. భారత దేశంలో మాత్రం అతి వేగంగా రూ.1000 కోట్లు రాబట్టిన చిత్రంగా నిలిచిన బాహుబలి 2, మొత్తంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.1800 కోట్లు వసూలు చేసింది. ఇది నిజంగా రాజమౌళికి ఆయన టీం కి పెద్ద షాకేనని, చైనాలో వస్తున్న ఇంత దారుణమైన కలెక్షన్లు విన్న ఆయన ఆలోచనలో పడ్డారని అంటున్నారు……

Comments