బ్రేకింగ్ న్యూస్ : డైలీ షూటింగ్ కి ఛాపర్ లో వెళ్తున్నబాలీవుడ్ స్టార్?

Friday, April 6th, 2018, 06:02:36 PM IST

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ ఖాన్ ఏ పని చేసినా చాలా గ్రాండ్ లెవెల్లో చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ విషయంలో తలెత్తుతున్న సమస్యలను అధిగమించేందుకు ఆయన ఒక వెరైటీ నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే, షారుక్ హీరోగా ప్రస్తుతం జీరో పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన మరగుజ్జు పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. రోజూ ట్రాఫిక్‌ కారణంగా షారూఖ్ షూటింగ్ కు ఆలస్యంగా వస్తుండటం,ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవటం, విజువల్‌ ఎఫెక్ట్స్‌ వర్క్‌ కూడా భారీగా ఉండటంతో యూనిట్‌ సభ్యుల్లో అనుకున్న సమయానికి విడుదల చేస్తామా లేదా అన్న ఆందోళన మొదలైంది.

అందుకే ఈ సమస్యని అధిగమించేందుకు షారుఖ్ స్పెషల్‌ చాపర్‌ వినియోగించాలని నిర్ణయించారు. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న లొకేషన్‌కు వెళ్లేందుకు రోజూ షారూఖ్‌ స్పెషల్ చాపర్‌ వినియోగిస్తున్నారట. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. షారూఖ్‌ సరసన కత్రినా కైఫ్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాకు ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు….

  •  
  •  
  •  
  •  

Comments