బ్రేకింగ్ … ఆక్సిడెంట్ కి గురైన పవన్ కాన్వాయ్

Thursday, November 15th, 2018, 09:24:50 PM IST

ఎన్నికలలో భాగంగా ఊరూరా పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కి రాజానగరం లో ఏర్పాటు చేసిన సభ లో పాల్గొనేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు బౌన్సర్లు గాయపడ్డారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ రాజానగరం బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్తుండగా రంగపేట వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడినట్టుగా మరికొందరు చెబుతున్నారు. అయితే, తీవ్రంగా గాయపడ్డ ఆ ముగ్గురిని మాత్రం వెంటనే ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి చిన్నపాటి గాయలు కావడం వలన ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్తున్నారు.