తెలుగులో ఊపిరి ఆపేసేందుకు వ‌స్తోంది!

Friday, January 26th, 2018, 02:27:47 PM IST

మాధ‌వ‌న్ అలియాస్ మ్యాడీ ప్ర‌స్తుతం ఓ వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. బ్రీత్ అనేది టైటిల్‌. టైటిల్‌కి త‌గ్గ‌ట్టే ఊప‌రి తీసుకోనివ్వ‌ని ఉత్కంఠ ఈ సిరీస్‌లో క‌నిపించ‌నుంది. ఆ సంగ‌తి ఇటీవ‌లే రిలీజైన టీజ‌ర్ చెప్పింది. తాజాగా నేటి నుంచి అమెజాన్ ప్రైమ్లో లైవ్‌కి రెడీ అవుతున్న ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్ అయ్యింది. వెబ్ సిరీస్ అయినా సినిమాని మించేలా గ్రిప్పింగ్ గా ఉంది ఈ ట్రైల‌ర్‌. “క‌న్న బిడ్డ‌ను బ‌తికించుకోవాలంటే ఒక తండ్రి యానిమ‌ల్ లాగా కానీ, మాన్‌స్ట‌ర్ (వికృత జీవి)లా కానీ మార‌డంలో ఆశ్చ‌ర్యం లేదు “ అంటూ మ్యాడీ చెబుతున్న డైలాగ్‌ని బ‌ట్టి ప్ర‌మాదంలో ఉన్న కూతురిని ర‌క్షించుకోవ‌డం కోసం అత‌డు ఏం చేశాడ‌న్న‌ది క‌థాంశం అని అర్థ‌మ‌వుతోంది. ఆ క్ర‌మంలోనే ఓ యాక్సిడెంట్‌.. పోలీస్ ఇన్వెస్టిగేష‌న్ త‌దిత‌ర విష‌యాలు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి.

హిందీ, త‌మిళం, తెలుగు మూడు భాష‌ల్లో అమెజాన్ ప్రైమ్‌లో ఈ వెబ్ సిరీస్ టెలీకాస్ట్ కానుంది. నేటి నుంచి అంటే జ‌న‌వ‌రి 26 నుంచి లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నామ‌ని అమెజాన్ ప్ర‌క‌టించింది. నిన్న‌నే బ్రీత్ ప్రీమియ‌ర్ షోని సెల‌బ్రిటీల కోసం ముంబైలో ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. రానున్న‌ది వెబ్ సిరీస్‌ల కాలం అని అర్థ‌మ‌వుతోంది క‌దూ?