రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల యువకులకు ఇక పెళ్లిళ్లు కావేమో..?

Friday, January 27th, 2017, 12:16:26 AM IST

marriage
రాజస్థాన్ , హర్యానా రాష్ట్రాల్లో ని యువకులకు తమ కుమార్తె ని ఇచ్చి వివాహం చేయాలంటే తల్లిందండ్రులు భయపడుతున్నారు.దీనికి కారణం ఆ రాష్ట్రాల్లో వదంతు వ్యాపించడమే. హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలలో కొందరు వారి భార్యలను తొలి చూరు కాన్పు అయ్యేంతవరకు పుట్టింటికి పంపడం లేదట.వారిలో నాటుకుపోయిన అపనమ్మకం వలన ఇలా జరుగుతోందని అంటున్నారు. భార్య కు పిల్లలు పుట్టక ముందే పుట్టింటికి పంపితే వారు తిరిగి రావడం లేదనే అపనమ్మకం ఏర్పడిందని అంటున్నారు. అందుకే తొలి కాన్పు అయ్యెవరకు వారిని పుట్టింటికి పంపడం లేదట.

దీనితో తల్లిదండ్రులువారి కుమార్తెలను రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లోని యువకులతో వివాహం చేయడానికి భయపడుతున్నారు.తమ భార్యకు అత్తగారితో కానీ, సోదరితో కానీ గొడవలు ఉంటె కాన్పు కాక మునుపే పుట్టింటికి వెళ్లిన భార్యలు తిరిగి రావడం లేదట. ఈ వ్యవహారం ఆయా రాష్ట్రాల్లోని అధికారుల వరకు కూడా వెళ్ళింది.