బెల్లంకొండ దెబ్బకు అబ్బా అనాల్సిందే!

Friday, June 1st, 2018, 05:24:17 PM IST

నాలుగు సినిమాల కిడ్ బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్‌. అత‌డు న‌టించిన నాలుగో సినిమా సాక్ష్యం ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. జూలై 20న రిలీజ్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఆ క్ర‌మంలోనే శీను త‌న త‌దుప‌రి చిత్రంపై దృష్టి సారించాడు. బెల్లంకొండ శ్రీ‌నివాస్ న‌టిస్తున్న ఐదో సినిమా ప్ర‌స్తుతం ఆన్‌సెట్స్ ఉంది. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసేశారు. ఈ సినిమాని ఇంట్రెస్టింగ్ శ్రీ‌నివాస్ అనే వేరొక డెబ్యూ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్నారు. అప్‌కం హీరో.. కొత్త ద‌ర్శ‌కుడు అయినా … ఇంకా స‌గం చిత్రీక‌ర‌ణ అయినా పూర్తి కాకుండానే హిందీ శాటిలైట్ రైట్స్‌ని 9.50 కోట్ల‌కు అమ్మేశార‌ని తెలుస్తోంది. అస‌లు శీను క్రేజు మామూలుగా లేదుగా అని ఓ వైపు చెవులు కొరుక్కుంటుంటే.. మ‌రోవైపు ఈ సినిమాలో అందాల చంద‌మామ కాజ‌ల్ న‌టిస్తుండ‌డంతో ఇంత పెద్ద డీల్ సెట్ట‌య్యింద‌ని చెబుతున్నారు. కాజ‌ల్ ఈరోజు నుంచి షూటింగులో పాల్గొంటోంద‌ని బెల్లంకొండ సోష‌ల్ మీడియా టీమ్ ప్ర‌క‌టించింది. 9.50కోట్ల‌కు హిందీ శాటిలైట్ హ‌క్కులు అమ్మ‌కాలు సాగించార‌ని ఈ టీమ్ అధికారికంగా ట్విట్ట‌ర్‌లో తెలిపింది.