ఉచితంగా ఇళ్లు ఇస్తామని చెప్పి పేదలను మోసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం – బుద్దా వెంకన్న

Tuesday, June 8th, 2021, 04:55:28 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై తెలుగు దేశం పార్టీ నేత బుద్దా వెంకన్న మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. పేద ప్రజలకు జగనన్న కాలనీల్లో ఇల్లు నిర్మించుకోవడానికి ఇచ్చే ఖర్చు లక్షా 80 వేలు అని బుద్దా వెంకన్న అన్నారు. అయితే అవి కూడా ప్రజలు కట్టించుకున్న తర్వాత ప్రభుత్వం ఎప్పుడో ఇస్తది అంటూ బుద్దా వెంకన్న విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇంటి అద్దెలు కట్టలేని వారు లక్షా 80 వేలు పెట్టి ఇల్లు ఎలా నిర్మించుకుంటారు అంటూ సూటిగా ప్రశ్నించారు. ముందు ఇల్లు కట్టుకోండి తర్వాత మేము డబ్బులు ఇస్తాం అని అనడం ఎంతవరకు సమంజసం అంటూ నిలదీశారు. అయితే తెలుగు దేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు 90 శాతం పైగా ఇళ్ళ నిర్మాణాలు పూర్తి అయ్యాయి అని వ్యాఖ్యానించారు. వాటిని ఎందుకు వృథా చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే అవి ప్రజాధనం తో నిర్మించిన ఇళ్లు అని, వాటిని వృథా చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఉచితంగా ఇళ్ళు ఇస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం పేదలను మోసం చేస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. మరి దీని పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.