జగన్ ప్రభుత్వానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన టీడీపీ నేత

Sunday, December 15th, 2019, 03:36:44 PM IST

ఇప్పటివరకు చంద్రబాబు ఫై చాల అవినీతి ఆరోపణలు చేసారు వైసీపీ నేతలు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి టీడీపీ ఫై పలు ఆరోపణలు చేసి, చంద్రబాబు అవినీతి చేసాడని నిరూపిస్తాం అని అన్నారు. అయితే అది ఇంకా జరగలేదు. కానీ సాక్షి దిన పత్రిక లో చంద్రబాబు గారి అవినీతి అంటూ వార్తలు రాసుకొని సంబరాలు చేసుకుంటే మీ ఇష్టం అంటూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు, అవినీతిని వెలికి తీస్తా అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తవ్వడం మొదలెట్టి ఏడు నెలలు కావొస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

అంతేకాకుండా తెలుగు సామెతలు చెబుతూ వైయస్ జగన్ ప్రభుత్వం ఫై విమర్శలు చేసారు. వెనకటికి మీ లాంటి వాడే ఒకడు కొండని తవ్వి ఎలకని పట్టుకున్నాడట, అయితే మీరు ఎలకని కాదు కదా, దాని తోక కూడా పట్టుకోలేకపోయారు అంటూ ఎద్దేవా చేసారు. బాబు గారి హయం లో 10 పైసలు అవినీతి జరిగినది అని నిరూపించలేని మీరు, జగన్ గారి ఫినాయిల్ పేపర్లో అవినీతి అంటూ ఏడుపెందుకు అని విమర్శించారు.