తాజాగా “మద్యపాన నిషేధం” వివాదం మొదలయ్యిందిగా!

Monday, November 18th, 2019, 07:21:59 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు ఇసుక విధానం, ఇంగ్లీష్ మీడియం లు సంచలనం గా మారాయి. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు నిర్ణయాలు ప్రతి పక్షాల పార్టీలకు అవకాశాలుగా మారి విమర్శలు చేయడానికి కుదిరింది. అయితే తాజాగా మద్యపాన నిషేధం వివాదం తెరపైకి వచ్చింది. అయితే దీనికి కారణం వైసీపీ నేతలు అని చెప్పాలి. చంద్రబాబు చేపట్టిన నిరసన దీక్షలో ఇసుక పొట్లాలు ,మేడలో వేసుకున్నాడు అంటూ వైసీపీ నేతలు వ్యంగంగా విమర్శించారు. అదే మద్యపాన నిషేధం అయితే బ్రాంది బాటిళ్లు మేడలో వేసుకుంటారేమో అన్నట్లుగా సంచలన వ్యాఖ్యలు చేసారు.

అయితే టీడీపీ నేత బుద్ధా వెంకన్న విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందించారు. జగన్ అన్న మద్యం దుకాణాల్లో సరుకు చాల కాస్టలీ గురూ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. సీసా మీద ఎమ్మార్పీ కంటే 30 రూపాయలు ఎక్కువ వాసులు చేస్తున్నారని, 8 దాటిన తరువాత ఇంకో 30 ఎక్కువ బాదుతున్నారంటూ చాల అన్నారు. అయితే రాష్ట్రాన్ని ఎం చేయాలనుకుంటున్నారు సాయిరెడ్డి గారు? అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ విషయం లో మద్యపాన నిషేధం వివాదం సరి కొత్తగా మొదలయ్యింది అని ప్రజలు భావిస్తున్నారు.