ఇసుక హ్యాకింగా? అదేమైనా వీడియో గేమ్ లో దొరికే వస్తువా?

Monday, November 18th, 2019, 07:22:14 AM IST

వైసీపీ నేతలు ఇసుక కి సంబందించిన వెబ్ సైట్ టీడీపీ హ్యాక్ చేసిందంటూ సంచలన ఆరోపణలు చేసారు. అంతేకాకుండా సాక్షి పత్రికలో దాని గురించి రాయడం కూడా జరిగింది. అయితే ఈ విషయం పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. వైసీపీ ప్రభుత్వం ఇసుక పాలసీ అనే కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టింది. అయితే దానిని ప్రవేశపెట్టడానికి రెండు నెలల సమయం తరువాత అందుబాటులోకి తెచ్చినా వరద కారణంగా ఇసుక ఇవ్వలేకపోతున్నాం అని సెలవిచ్చారు అని అన్నారు. దొరికిన కాస్త ఇసుకని ఇతర రాష్ట్రాలలో అమ్మేసారు. ఈ ఇసుక హ్యాకింగ్ ఏంటి సామి?ఓట్లేశారు కదా అని అందరు గొర్రెలు అనుకుంటే ఎలా విజయసాయిరెడ్డి గారు అని బుద్ధా వెంకన్న అన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత ఉందన్న విషయం అందరికి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ఇసుక వరదల వలన ఇవ్వలేకపోతున్నాం అని, ఆ తరువాత వరదలు తగ్గుముఖం పట్టాక కొత్త విధానాలతో ఇసుక అందుబాటులో ఉందని తెలిపిన విషయం అందరికి తెలుసు. అయితే కొత్తగా ఇసుక వెబ్ సైట్ ని హ్యాక్ చేసారు టీడీపీ నాయకులూ అని అనడంతో కొత్త వివాదం రాజేసుకుంది. అదేమైనా వీడియో గేమ్ లో దొరికే వస్తువా?ఇసుక హ్యాక్ చేసారు అని చెత్త పత్రికలో రాసుకొని ఆనందపడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.