వైసీపీ నేత పై దారుణ వ్యాఖ్యలు చేసిన బుద్ధా వెంకన్న

Wednesday, September 18th, 2019, 02:47:13 PM IST

కోడెల మృతి పట్ల పలువురు నేతలు ఒకరి పై ఒకరు విమర్శలు చేస్తున్నారు. కాగా ఇప్పటికే పలు విషయాలలో సంచలన వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి, ఇపుడు టీడీపీ నేత బుద్ధా వెంకన్న చేతికి చిక్కారు. శవాల మీద చిల్లర ఏరుకొని రాజకీయం చేసే నువ్వు కోడెల గురించి మాట్లాడటం విడ్డురంగా వుంది అంటూ బుద్ధా వెంకన్న అన్నారు. రాజ్యసభ ఎన్ని కల విషయాన్నీ గుర్తు చేస్తూ, ఎన్నికల సమయం లో కోడెల నీకు సహాయం చేయకపోతే జైల్లో చిప్పకూడు తినేవాడిని మర్చిపోయావా? అంటూ వ్యాఖ్యలు చేసారు.

కోడెల మీద కేసు పెడితే సహాయం చేస్తా అన్న నువ్వు, ఇపుడు కోడెల మృతి పట్ల ఇలా వ్యాఖ్యలు చేయడం ప్రజలంతా చూస్తూనే వున్నారు అని అన్నారు. మీరు, మీ ప్రభుత్వ తీరుతో పులి లాంటి కోడెల ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఇపుడు వచ్చి టీడీపీ శవ రాజకీయం చేస్తుంది అంటూ నంగనాచి కబుర్లు చెప్పకు అని అన్నారు.